Venky Adabala
May 15, 2015
వెంకి మనసులోని మాట ....
.......వినేవారికి వరాల మూట
హలో !!! ఆఫీసుకి వెళ్ళాలి, లే...!! అన్న పిలుపుతో
కళ్ళు నలుపుకుంటూ, ఒళ్ళు విరుచుకుంటూ
పక్కనున్న సెల్ ఫోనులో టైం చూస్తూ...
ఆవులించుకుంటూ, అడుగు కింద పెట్టిన
సమయం మొదలు........
ప్రతీరోజు చేసే పనే అయినా,
చుట్టూ వుండే వారిని ఎప్పుడూ చూస్తున్నా,
ఏవేవో ఊహలు, ఆగిపోని ఆలోచనలు
నన్ను అందరినుంచి దూరంగా నెడుతూ వుంటే
ఏమిటా ఆలోచనలు అని వెనుతిరిగి తలుచుకుంటే
వచ్చే పిల్లాడిని మా అమ్మనాన్ననన్ను చూసినట్టుగా చూడగలుగుతానా?
వాడికి మంచి మార్గదర్శకుడిని కాగలనా?
నాకంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సాయపడగలనా?
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...........
ఆ సమయంలో నా మనసుకు నేను సర్దిచెప్పే తరుణం
...పిల్లవాడి రాక ఒక ప్రేమ పూల తోట
ఆ తోటలో బగవంతుడు వాడికి వేసాడొక బాట
ఆ బాటలోని ఆటు పోటులను అధికమించడం ఒక ఆట
ఆ ఆటలో నెగ్గాలంటే నువ్వు వినాలి మన....
....................కృష్ణ శర్మ గారి మాట
ఆ మాట మూడు రోజుల ముత్యాల మూట
నిజ జీవితాల సమాకరంతో కూడిన ఒక పాట
ఆ పాటలలోని ఒక్కొక్క చరణం నాలోని
సందేహాలకి సమాధానo.....
నా లాంటి వారెందరో ఎన్నో ప్రశ్నలతో వున్నారీ సమాజంలో
అందరికీ నా తరపున ఒకటే సూచన
చేరండి మన “గృహస్థ” చెంతన
ఏలండి మీ జీవితాన్ని నిశ్చింతన.....
ఎప్పుడూ మీ మంచిని కోరే
....వెంకీ అడబాల......