Adiseshagiri Rao Kambhammettu
November 13, 2010
నేను మేధాజననం workshop కు వెళ్ళగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. మేధాజననం లో తెలుసుకొన్న చాలా విషయాలు యింతకు ముందు తెలిససినవే అయినప్పటికీ అవే విషయాలు ఇప్పడు వేరే కోణం లో కనిపిస్తున్నాయి.
చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మవిభాగశః – అని చదివినప్పుడు మనుష్యులను వారి తత్వాలను అనుసరించి నాలుగు రకాలుగా గుర్తించినట్లు భావించాను. కాని వారినిగుణము ననుసరించి ఏ ప్రాతిపదికన ఎలా విభజించాలి అన్నవిషయం తెలుసుకోలేకపోయాను. మేధాజననం లో చెప్పిన color concept తో ఆ లోటు తీరింది. ఈ విఙ్ఞానం అందరితో చక్కగా మెలగటానికి ఉపకరిస్తోంది.
నేను మేధాజననానికి వెళ్ళివచ్చిన తర్వాత చాలాసందర్భాలలో “అప్పుఢు అలాచేయటం – ఆ సమయంలో అదేసరియైనది.” అన్న మాటలు అనుకొంటూ ఉన్నాను. ఈ మాటలు నాకు ఆ విషయాలలో ఉన్న అసంతృప్తిని తొలగించి సంతోసాన్నిస్తున్నాయి.
నేటి సమాజంలో చాలామంది ఆధ్యాత్మిక విషయాలకు, బాధ్యతలకు, సంఘసేవకు దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. జీవన రథం, four petal concepts ప్రాధాన్యతలను చక్కగా వివరించింది.
నాలో ఎప్పుడూ ఉండే ప్రశ్నలు – ఈ జీవితం ఏమిటి? ఎందుకు ఈ సృష్టి జరుగుతోంది? ఎందుకు ప్రతివారి జీవితాలు వేరు వేరు గా ఉంటున్నాయి? అన్నవి. ఈ ప్రశ్నలకు మేధాజననం లో చెప్పిన విషయాలు యింకొంచెం పద్ధతిగా ఆలోచించటానకి ఉపకరిస్తున్నాయి.
మనిషి తనను తాను మెరుగు పరుచుకొనేందుకు break the shell concept చాలా బాగుంది. గురువు శిష్యుని ప్రగతి వేగాన్ని పెంచినట్లుగా ఈ concept త్వరగా తన consciousness పెంచుకొనేందుకు ఉపకరిస్తుంది.
నాకు చాలా రోజులుగా ఒక ప్రశ్న వేధిస్తూ ఉండేది. వేదాలు, పురాణాలు చెప్పిన దేవతలను కాకుండా చాలామంది, రకరకాల క్రొత్తదేవుళ్ళను, మనుష్యులను దేవతలుగా ఎందుకు భావిస్తున్నారని? Three Gods concept నాకు చక్కగా ఈ విషయాన్ని వివరించింది.
వ్యక్తావ్యక్త స్థితిచక్ర భ్రమణాన్నిఓంకారంగా చెప్పటం నాకు క్రొత్త విషయం. అది తెలుసు కొన్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది. ప్రతి organism కు వ్యక్త, అవ్యక్త స్థితులు ఉంటాయని, మన స్థితి ఇతర organism స్థితి తెలుసు కోవటం ద్వారాఇతరుల ప్రవర్తనను తెలుసుకోవచ్చనితెలిసింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది.
ఒక ఐదు రోజులలో ఎన్నో విషయాలను విడమర్చి తెలుసుకో గలిగాను. అందుకు కృష్ణ శర్మ కు ఎన్నోధన్యవాదములు.
కంభంమెట్టు ఆదిశేషగిరిరావు