Satya Dhulipala
October 28, 2010
మేధాజననం లో నాకు ఏమి నచ్చిందో చెప్పబోయేముందు, ఇలాంటి గొప్ప విషయాన్ని తెలియజేసినందుకు ముందుగా మా అన్నయ్యని అభినందించాలి. నేను మేధాజననం Attend కాకముందు కొత్తవాళ్లతో మాట్లాడటానికి ఇబ్బంది పడేదాన్ని. నాకు సరిగా మాట్లాడటం రాదేమో, ఏది మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని Feel అయ్యేదాన్ని. ఆ కంగారులో ఒకటి మాట్లాడాలనుకుని వేరొకటి మాట్లాడేదాన్ని. మేధాజననం Attend అయిన తరువాత నాలో Confidence పెరిగింది. ఇప్పుడు అందరితో బాగా మాట్లాడగలుగుతున్నాను.
ఇంతకు ముందు చాలా Moody గా ఉండేదాన్ని. మేధాజననం Attend అయిన తరువాత Moods ను Control చేసుకోగలుగు తున్నాను. చాలావరకు సంతోషంగా ఉండగలుగుతున్నాను. ఎప్పుడూ గతాన్ని తలుచుకుని బాధపడేదాన్ని. ఆ కోపం మా అమ్మ మీద చూపించి తనను బాధపెట్టేదాన్ని. ఇప్పుడు గతం గతః అనుకుంటున్నాను. నన్నెవరూ ఇష్టపడరు అనుకునే దాన్ని ఇప్పుడు అలా అనుకోవటం లేదు. ఇప్పుడు నాకు చాలా చాలా బాగుంది. చాలా Confidence వచ్చింది. ఇప్పుడు నన్ను చూసి మా అమ్మ చాలా సంతోషంగా ఉంది.
మేధాజననం లో Colors గురించి చెప్పటం నాకు చాలా నచ్చింది. ఇప్పుడిప్పుడే ఎదుటి వాళ్ల Colors గురించి అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇంతకుముందు ఎవరైనా నాకు నచ్చని విధంగా ఉంటే అసహనం గా Feel అయ్యేదాన్ని. వాళ్ళతో చాలా కోపంగా ప్రవర్తించేదాన్ని. ఇప్పుడు అలా అనిపించటం లేదు. వాళ్ళ Color ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు,నా Color ని బట్టి కాదుకదా అనిపిస్తుంది. నేను మేధాజననం కు Attend అయి రెండువారాలు దాటింది. ఈ రెండువారాల్లో ఇంట్లోకానీ, బయటకానీ ఎవరిమీదా అసహనం ప్రదర్శించలేదు. అసలు అసహనంగా అనిపించటంలేదు. Thanks to మేధాజననం.
మేధాజననం వల్ల నాలా ఎందరికో మంచి జరగాలని కోరుకుంటూ, మరొక్కసారి మా అన్నయ్యని అభినందిస్తూ_____ Satya Dhulipala